తమిళనాడులో పోలీసులకు వీక్లి ఆఫ్

తమిళనాడులో పోలీసులకు వీక్లి ఆఫ్

చెన్నై: తమిళనాడు పోలీసులకు శుభవార్త చెప్పారు డీజీపీ సి.శైలేంద్ర బాబు. రాష్ట్రంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. నిరంతరం ఒత్తిళ్లతో 24/7 పై అధికారుల కనుసన్నల్లో పనిచేసే పోలీసు శాఖలోని ఫ్యామిలీలకు ఇది నిజంగా శుభవార్తే. 
వీక్లి ఆఫ్ తోపాటు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాల రోజున కూడా సెలవు తీసుకునేందుకు ఆయన అనుమతించారు. పోలీసులు శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యాన్ని, కుటుంబ బంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఒకవేళ వీక్లీ ఆఫ్‌ రోజున డ్యూటీ చేయాల్సి వస్తే.. లేదా చేసినా.. అదనంగా ఆ రోజుకు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.